Paritala Ravi Murder Case: సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ హత్య జరిగిన 18 ఏళ్లకు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం.. ఈ కేసులో A3గా ఉన్న పండుగ నారాయణరెడ్డి, A4గా ఉన్న రేఖమయ్య, A5గా ఉన్న బజన రంగనాయకులు, A6గా ఉన్న వడ్డే కొండ, A8గా ఉన్న ఓబిరెడ్డిలకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. అయితే, ఈ సందర్భంగా షరతులు విధించింది హైకోర్టు.. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని.. 25 వేల రూపాయలతో రెండు పూచీ కత్తులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతే కాదు.. జైలు నుంచి విడుదలయ్యాక నడవడిక బాగోలేనట్టుగా ఫిర్యాదు వస్తే బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది..
Read Also: Lagacharla Incident: లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
ఇక, 18 ఏళ్ల పాటు శిక్ష అనుభవించారు కాబట్టి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కి సూచించింది.. కానీ, దరఖాస్తు చేసుకుంటే నిబంధనలకు మేరకు ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది ఏపీ హైకోర్టు.. కాగా, మాజీ మంత్రి, టీడీపీలో కీలక నేతగా ఉన్న పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు.. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా.. ప్రత్యర్థులు దాడి చేసి ఆయనను చంపేశారు.. ఇక, పరిటాల రవి హత్య తర్వాత ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు.. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం విదితమే..