Site icon NTV Telugu

Mumbai Actress Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఐపీఎస్‌ అధికారులకు ఊరట..

Ap High Court

Ap High Court

Mumbai Actress Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారులకు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, ఈ నెల 26వ తేదీ వరకు కౌంటర్‌ ఫైల్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఇదే సమయంలో.. నవంబర్‌ 26వ తేదీ వరకు ఇంటీరియమ్ ఆర్డర్స్ పొడిగించింది.. కాగా, సినీ నటి జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు… ఇదే కేసులో ఇంప్లిడ్ అయ్యారు సినీనటి జత్వానీ.. మొత్తంగా ఈ కేసులో విచారణ 26వ తేదీకి వాయిదా పడడంతో.. అప్పటి వరకు ఐపీఎస్‌లు, పోలీసు అధికారులకు ఊరట లభించినట్టు అయ్యింది.. కాగా, గత ప్రభుత్వంలో తనను వేధింపులకు గురిచేశారంటూ.. కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు నటి జత్వానీ.. ఆ తర్వాత కేసు నమోదు చేయడం.. ఈ వ్యవహారంలో కలగజేసుకున్నారన్న అభియోగాలతో ఐపీఎస్ అధికారులు సహా.. పలువురు పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిపోయిన విషయం విదితమే..

Read Also: Bhairavam : నారా రోహిత్ ‘వరదా’ ఫస్ట్ లుక్.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్

Exit mobile version