NTV Telugu Site icon

YS Jagan UK Tour: వైఎస్‌ జగన్‌కు బిగ్ రిలీఫ్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Ys Jagan

Ys Jagan

YS Jagan UK Tour: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. తాజా పాస్ పోర్టు పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్‌ జగన్ కు పాస్ పోర్ట్ జారీ చేయాలని పాస్ పోర్ట్ అధికారులను ఆదేశాలు జారీ చేసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కోసం ఈ నెల 16వ తేదీన యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసుకున్న అభ్యర్థనలు ఆమోదం తెలిపింది హైకోర్టు.. ఎన్‌వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై 20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి..

Read Also: China Manja : “చైనా మాంజా యమ డేంజర్”.. అమ్మితే ఇలా ఫిర్యాదు చేయండి..

Show comments