AP High Court: మాజీ మంత్రి బాలినినేని శ్రీనివాస్‌రెడ్డి వేసిన పిల్‌పై ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గత ఎన్నికల సమయంలో ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అవకతవక జరిగాయంటూ అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పిల్ వేశారు.. ఈవీఎంల వ్యవహారంపై ఆగస్టు 13వ తేదీన హైకోర్టులో పిల్ వేశారు బాలినేని.. అంతేకాదు.. ఆ పిల్‌పై ఆగస్టు 15వ తేదీన వాదనలు వినిపించారు బాలినేని తరుపున న్యాయవాది ఆలపాటి వివేకానంద.. ఇక, ఆగస్టు 17వ తేదీన తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.. ఈరోజు బాలినేని పిల్‌పై తుది తీర్పును వెలువరించనుంది హైకోర్టు..
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మాజీ మంత్రి బాలినేని.. గత ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ.. ఆయన పిల్ వేశారు.. అయితే, ఆ తర్వాత కీకల రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవడం.. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరడం జరిగిపోయింది.. మరి.. ఇవాళ హైకోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతోంది..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత.. ఆ పార్టీపై.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన చుట్టూ ఉన్న నేతలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాట్ కామెంట్లు చేసిన విషయం విదితమే..