Site icon NTV Telugu

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్‌ సిగ్నల్

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు, 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.

Read Also: Virat Kohli: ఈ విజయం ఆర్సీబి అభిమానులకు అంకితం.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..!

ఇక, వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకువచ్చిన ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌.. పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పనపై చర్చించి.. ఆ ప్రతిపాదలనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. మరోవైపు, ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్‌ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌..

Exit mobile version