Site icon NTV Telugu

Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ఆలోచన లేదు..!

Ap Govt

Ap Govt

Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అసలు తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది.. తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలను విరిమించుకోవాలని స్పష్టం చేసింది.. మరోవైపు, ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంలో ఆరా తీస్తోంది ప్రభుత్వం.. కేసుపై RPF సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు.. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులకు వార్నింగ్‌ ఇచ్చింది సర్కార్.. ప్రభుత్వ ఆదేశాలతో మరి కొద్ది సేపట్లో జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి..

Read Also: Rana Naidu: Season 2: ‘రానా నాయుడు’ సీజన్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది.. ఈసారి మొత్తం..!

కాగా, తుని రైలు ఘటన కేసులో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కి వెళ్లాలని ప్రభుత్వం నుంచి మొదట ఉత్తర్వులు ఇచ్చాయి.. హైకోర్టులో అప్పీల్ చెయ్యాలని పీపీకి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముద్రగడ సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో తీర్పు వచ్చింది. గత ప్రభుత్వంలో కాపు ఉద్యమకారులపై కేసులన్నీ కొట్టేశారు. మళ్లీ తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులు విచారించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగింది.. కానీ, తుని రైలు దగ్ధం కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అసలు తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది..

Exit mobile version