Site icon NTV Telugu

AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..!

Ap Govt

Ap Govt

AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్.. వారికి పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.. పది మంది మంత్రులతో కేబినెట్‌ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జీవోఎం కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కూడా ఉన్నారు.. ఇక, జీవోఎం కమిటీలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు, పద్ధతులపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం..

Read Also: Nobel Prize in Economics 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..

ఇంటర్మీడియరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్ నిర్ణయించాలని పేర్కొంది సర్కార్.. ఇంటర్మీడియరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని జీవోఎంను ఆదేశించింది ప్రభుత్వం.. ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కల్గిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని తెలిపింది.. పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని పేర్కొంది.. పదోన్నతుల తర్వాత హేతుబద్దీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపై చర్చించాలని ఆదేశించింది.. వీలైనంత త్వరగా అధ్యయనంపూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్..

Exit mobile version