NTV Telugu Site icon

AP Assembly Session: నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు..

Ap Assembly 2024 4th Day

Ap Assembly 2024 4th Day

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు రానున్నాయి.. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్.ఎంఎడి.ఫరూక్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు.. రుషికొండ నిర్మాణాలు, NGT నిబంధనల ఉల్లంఘన.. వరదల వల్ల ఏర్పడిన పరిస్ధితులపై స్వల్పకాలిక చర్చ సాగనుంది.. ఇక, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లు విషయానికి వస్తే..

ప్రభుత్వ బిల్లులు:
1. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్
2. ఏపీ మునిసిపల్ చట్టాల రెండవ సవరణ బిల్లు 2024, మంత్రి నారాయణ
3. AP GST సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్
4. AP VAT సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్
5. ఏపీ ధర్మ, హిందూమత సంస్ధలు, దేవాలయాల చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
6. ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ రిపీల్ బిల్లు 2024, బి.సి.జనార్ధనరెడ్డి

మంత్రుల ఇచ్చే స్టేట్‌మెంట్లు..
1. డ్రోన్ పాలసీ పై మంత్రి బి.సి.జనార్ధనరెడ్డి
2. స్పోర్ట్స్ పాలసీ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి
3. పర్యాటక పాలసీ పై మంత్రి కందుల దుర్గేష్
4. ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ పాలసీలపై మంత్రి నారా లోకేష్

మరోవైపు.. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ఏపీ కౌన్సిల్ ప్రారంభంకానుంది.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.. ఇక, అంగన్వాడీల‌ సమస్యలపై కౌన్సిల్ లో తాత్కాలిక చర్చ సాగనుంది..

శాసన మండలిలో ప్రభుత్వ బిల్లులు:
1. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
2. భారత దేశంలో తయారైన విదేశీ మద్యం నియంత్రణ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
3. ఏపీ ప్రొహిబిషన్ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
4. ఏపీ అప్రాప్రియేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్