Special Task Force: జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించడంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతరం నేషనల్ హైవే ప్రాజెక్టుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. NHAI, MoRTH ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. రోడ్లు భవనాలు శాఖామంత్రి చైర్మన్ గా 12 మంది సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్.. జలవనరుల శాఖ, ఇంధన శాఖల స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీలు, CCLA, పంచాయితీరాజ్, గనులు, రోడ్లు భవనాల శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సహా 11 మంది అధికారులు ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.. ఇక, ఈ టాస్క్ ఫోర్స్ నెలకొకసారి సమావేశం కావడం.. రోడ్ల నిర్మాణానికి ఉన్న అడ్డంకులను.. ప్రధాన సమస్యలకు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడంపై ఫోకస్ పెడుతోంది..
Read Also: Minister Komatireddy: వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం.. మంత్రి కీలక ప్రకటన