NTV Telugu Site icon

AP Budget Session: మూడో వారంలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..!

Ap Assembly 2024 4th Day

Ap Assembly 2024 4th Day

AP Budget Session: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది.. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది.. రెండు రోజుల్లో బడ్జెట్ అంచనాలపై ఆర్ధిక శాఖ మొదటి సమావేశం నిర్వహించనున్నట్టుగా చెబుతున్నారు.. వచ్చే నెల 1న అనగా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ రాబోతోంది.. లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతామారన్‌.. కేంద్ర బడ్జెట్‌ 2025-26ను ప్రవేశపెట్టబోతున్నారు.. దీంతో, ఏపీ బడ్జెట్‌ 2025- 26 బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం అవుతోంది.. ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయి.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి సర్కార్‌ ఎలాంటి ప్రణాళికలతో రాబోతుంది అనేది ఆసక్తికరంగామారింది..

Read Also: Varun Chakravarthy: మ్యాచ్ ఓడినా.. రికార్డులు సృష్టించిన వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి