Site icon NTV Telugu

Andhra Pradesh: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాపై ఉత్తర్వులు జారీ.. ఎవరికి వర్తిస్తుందంటే.?

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్‌.. ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. అటల్‌ బీమా – ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయంతో హైబ్రిడ్ మోడ్ లో కొత్త బీమా సౌకర్యం కల్పించనున్నారు.. రూ.25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు సంబంధించి విధి విధానాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, యూనివర్సల్ హెల్త్ పాలసీ కోసం ఇన్సూరెన్స్ సంస్థలను టెండర్లకు పిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Read Also: Monarchy Countries 2025: 21వ శతాబ్దంలోనూ రాచరికం.. రికార్డ్ సృష్టించిన 5 దేశాలు

యూనివర్సల్ హెల్త్ పాలసీ విధివిధానాలు..
ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించనుంది ప్రభుత్వం.. BPL కుటుంబాలకు ఇది వర్తింపుజేయనున్నారు.. ఏడాదికి 5 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్నవారికి హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది.. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ ఎం ప్యానల్ హాస్పిటల్స్ కు వర్తింపజేస్తారు.. 3,257 రకాల వ్యాధులకు మెడికల్ మరియు సర్జికల్ ప్రొసీజర్లకు వర్తింపజేయనున్నారు.. ఆయుష్మామాన్ భారత్ లో ఉన్న 1946 హెల్త్ బెనిఫిట్ ప్యాకేజీలకు కూడా వర్తించనుంది.. అటల్ భీమా – ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయంతో హైబ్రిడ్ మోడ్ లో కొత్త బీమా సౌకర్యం కల్పిస్తున్నారు..

Read Also: Robot Pregnancy: ఇనుములో హృదయం..! కట్ చేస్తే.. షాకింగ్ ట్విస్ట్

ఇక, డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో భాగంగా ఇన్సూరెన్స్ లో 2,550 రకాల వ్యాధులు, ఎన్టీఆర్ వైద్య సేవలోని 3,257 రకాల వ్యాధులకు ఇది వర్తింపజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు..

Exit mobile version