NTV Telugu Site icon

Sankranti Holidays: ఏపీలో వారికి మరో రోజు సెలవు.. ఉత్తర్వులు జారీ

Bank Holiday

Bank Holiday

Sankranti Holidays: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు మరో రోజు సెలవుగా ప్రకటించింది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో 73 జారీ చేశారు. అయితే, కనుమ రోజు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి చేయగా.. దీంతో, కనుమ రోజు అంటే జనవరి 15వ తేదీన ప్రభుత్వ సెలవుగా ఖరారు చేశారు.. కాగా, డిసెంబర్‌లో జారీ చేసిన 2025 ప్రభుత్వ సెలవుల్లో ఏపీలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14వ తేదీన మాత్రమే సెలవుగా ప్రకటించారు. దాని ప్రకారం కనుమ రోజు బ్యాంకులు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది.. దీనిపై యునైటెడ్‌ ఫోరం ఫర్‌ బ్యాంక్ యూనియన్స్‌, ఏపీ స్టేట్ యూనిట్‌ 15వ తేదీన కూడా సెలవుగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో.. డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణలు చేస్తూ ఈ రోజు జీవో నంబర్ 73 విడుదల చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్..

Read Also: Deputy CM Pawan Kalyan: పల్లె సౌభాగ్యమే.. దేశ సౌభాగ్యం.. భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

కాగా, సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పది రోజులపాటు సెలవులు ప్రకటించిన విషయం విదితమే.. జనవరి 10 నుంచి 19 వరకు.. అంటే 10 రోజులపాటు సెలవులు ప్రకటించగా.. జనవరి 20న సోమవారం తిరిగి స్కూళ్లు ప్రారంభం కానున్న విషయం విదితమే.. మొత్తంగా ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త చెబుతూ.. కనుమ రోజు కూడా హాలీడేగా డిక్లేర్‌ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Show comments