Amaravati Capital: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే అన్ని అడ్డంకులను అధిగమించి.. రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధం అవుతోంది.. ఈ నేపథ్యంలో అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది ఏపీ సర్కార్.. మొన్న ఢిల్లీ టూర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు.. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉండడంతో ప్రధాని నరేంద్ర మోడీ చేత మళ్లీ రాజధాని ప్రారంభోత్సవం చేయిచాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు.. దీని కోసం వచ్చే నెలలో రెండు తేదీలను పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం.. అయితే, ప్రధాని మోడీ ఇచ్చే అపాయింట్‌మెంట్ ప్రకారం.. అందులో ఏదో ఒక డేట్ ఫిక్స్ అవుతుందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు…
Read Also: Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో పోలీసుల భారీ భద్రత
మొత్తంగా వచ్చే నెల మూడో వారంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు.. రాజధాని అమరావతి ప్రాంతంలో నవ నగరాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.. స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీల్లో ఏదో ఒకటి ప్రధాని నరేంద్ర మోడీచే శంకుస్థాపన చేయించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. కాగా, రాజధాని అమరావతిలో మొత్తం రూ. 64,721 కోట్లతో 73 పనులను అంచనా వేసింది ఏపీ ప్రభుత్వం.. ఆ 73 పనుల్లో 63 పనులకు టెండర్లు పూర్తి చేశామని ఇప్పటికే మంత్రి నారాయణ వెల్లడించారు.. వాటి విలువ రూ. 39,678 కోట్లని తెలిపిన విషయం విదితమే.. అమరావతి నిర్మాణాలపై అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన ఆయన.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల భవనాల నిర్మాణాలు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని.. సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపి సంస్థలకు లేఖలు ఇస్తామని పేర్కొన్నారు.. మొత్తంగా అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రూ. 13,400 కోట్లు ఇవ్వడానికి అనుమతి ఇచ్చాయని.. కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ రూ. 5 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు అనుమతివచ్చిందని తెలిపారు.. ఇక, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద రూ. 1560 కోట్లు ఇస్తుందని కూడా మంత్రి నారాయణ వెల్లడించిన విషయం విదితమే..