Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..

Ap Govt

Ap Govt

Retirement Age: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ మోడల్‌ స్కూళ్ల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు వారి రిటైర్మెంట్‌ ఏజ్‌ ను 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నిర్ణయం ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ వర్తించనుంది. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోఎంఎస్ నం.45కు అనుగుణంగా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జి.ఓ.ఎం.ఎస్. నం.18ను విడుదల చేసింది. ఈ మేరకు అవసరమైన పరిపాలనా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మోడల్ స్కూల్స్ ఉద్యోగులు మరో రెండేళ్ల పాటు సేవలు కొనసాగించే అవకాశం లభించనుంది.