Site icon NTV Telugu

Andhra Pradesh: రిటైరయ్యే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇలా రీ ఎంట్రీ..!

Ap Govt

Ap Govt

Andhra Pradesh: రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మళ్లీ వాళ్లు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించేందుకు విధివిధానాలు ఖరారు చేసింది. రిటైరైన ఉద్యగులను మిడిల్ లెవల్ ఆఫీసర్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా రీ అపాయింట్‌మెంట్‌ కోసం విధివిధానాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. గతంలో ఎలాంటి విధి విధానాలు పాటించకుండానే నియామకాలు జరిగాయని జీవోలో వెల్లడించింది.. ఇప్పడు విధివిధానాలు నియామకం కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌ కమిటీలునియమిస్తూ జీవో విడుదల చేసిది.. డిప్యూటీ సెక్రటరీ / డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ లో వారిని నియమించాలనుకుంటే దాని కోసం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఛీఫ్ సెక్రటరీ, పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సీఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సెక్రటరీ / డిప్యూటీ డైరెక్టర్ అంతకన్నా కింది స్ధాయిలో రిటైర్డ్ ఉద్యోగుల నియామకాలకు జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.. స్క్రీనింగ్ కమిటీ ఆమోదం పొంది ఎవ్వరినైనా రీ అపాయింట్మెంట్ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి అనుమతి పొందాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.

Read Also: SSMB 29: వెయ్యి కోట్లతో కౌంట్‌డౌన్.. మహేష్-రాజమౌళి సినిమా అందుకే ఆలస్యం?

Exit mobile version