NTV Telugu Site icon

AP Capital Amaravati: రాజధాని నిర్మాణం ఇక చకచకా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Amaravati

Amaravati

AP Capital Amaravati: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఇక చకచకా సాగనున్నాయి.. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు.. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు.. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్టమెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం కూడా నిధుల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే..

Read Also: AUS vs IND: భారత్- ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు.. హాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయటంతో పాటు శాఖమూరు, నీరు కొండవద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం 1585 కోట్ల రూపాయాలు వెచ్చించనుంది సీఆర్డీఏ.. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లుతో 1200 అపార్టమెంట్ల నిర్మాణం కోసం 984 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రెయిన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజి, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు కోసం నిధులను వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా 20 సివిల్ పనులకు గానూ 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం చేసేందుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Show comments