NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారీగా నిధుల పెంపు.. ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పిలుపు..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులను భారీగా పెంచింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వెల్లడించారు.. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.. వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచామన్నారు.. ఆగస్టు 15వ తేదీన కార్యక్రమాలకు గతంలో.. రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను.. ఇప్పుడు రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచామన్నారు. ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారన్న ఆయన.. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేశామన్నారు.. ఇక, జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని వెల్లడించారు. మరోవైపు.. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టతను ఈ సందర్భంగా చెప్పాలని సూచించారు.. పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలన్నారు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.

Read Also: YVS Chowdary: ఒకే సామాజిక వర్గ హీరోలతో సినిమాలు.. వైవీఎస్ చౌదరి షాకింగ్ ఆన్సర్

Show comments