AP Government: గనుల్లో తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అక్రమాలు జరగని గనుల్లో తవ్వకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. చిన్నపాటి అక్రమాలు జరిగితే పెనాల్టీలు విధించి తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వాలని పేర్కొంది ప్రభుత్వం. భవిష్యత్తులో అక్రమాలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది.. నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాతే గనుల్లో తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. గనుల్లో తవ్వకాలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వానికి నివేదికలు అందాయి.. ముడి సరుకు నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అయితే, గత ప్రభుత్వంలో గనుల్లో తవ్వకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా గనుల్లో తవ్వకాలను నిలిపివేసింది కూటమి ప్రభుత్వం.. సిలికా, క్వార్ట్జ్ గనుల తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ చేపట్టింది.. అయితే, అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత.. అక్రమాలు జరగని గనుల్లో తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..
Read Also: Cyclone Dana: తీవ్ర రూపం దాల్చిన దానా తూఫాన్..