Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: రక్షణ దళాల సిబ్బందికి గుడ్‌న్యూస్‌.. పవన్‌ కీలక ప్రకటన

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌కు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం.. 5 ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.300 గజాల ఇంటి స్థలం.. మురళీ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు భారత రక్షణ దళాల్లో పనిచేసే సిబ్బందికి శుభవార్త చెబుతూ.. కీలక నిర్ణయాన్ని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Read Also: AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. మరో లిస్ట్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్ మన సైనికులకు అండగా నిలుస్తుందని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌.. మన ధైర్యవంతులైన సైనికులకు గౌరవం, కృతజ్ఞతగా, ఆంధ్రప్రదేశ్‌లోని NDA ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పారామిలిటరీ, CRPF సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుందన్నారు.

Read Also: AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. మరో లిస్ట్‌ విడుదల..

ఇప్పటివరకు, ఈ మినహాయింపు పదవీ విరమణ చేసిన సైనిక సిబ్బందికి లేదా సరిహద్దుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మేం ఒక అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నామని తెలిపిన పవన్‌ కల్యాణ్‌.. ఇప్పటి నుండి, భారత రక్షణ దళాలలోని అన్ని చురుకైన సిబ్బంది, వారు ఎక్కడ నియమించబడినా, ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులు. వారు లేదా వారి జీవిత భాగస్వామి నివసిస్తున్న లేదా సంయుక్తంగా కలిగి ఉన్న ఒక ఇంటికి మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఇది మన యూనిఫాం ధరించిన వీరులకు ఆంధ్రప్రదేశ్ యొక్క కృతజ్ఞతకు చిహ్నంగా నిలుస్తుంది.. మన ప్రభుత్వం ప్రతి సైనికుడికి మరియు వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది. వారి సేవ అమూల్యమైనది.. సాధ్యమైన ప్రతి విధంగా దానిని గౌరవించడం మన కర్తవ్యం. జై హింద్!.. భారత్ మాతా కీ జై! అంటూ ఎక్స్‌ (ట్వీట్)లో పోస్ట్‌ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version