Site icon NTV Telugu

Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. టెండర్లు ఖరారు

Amaravati

Amaravati

Amaravati: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే పలు పనులకు చురుకుగా కొనసాగుతుండగా.. ఇప్పుడు .. అమరావతిలో రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. టెండర్లలో L1 గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఎపీ సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాలు (GAD టవర్) నిర్మాణ పనులను ఎన్ సీసీ లిమిటెడ్.. రూ.
882.47 కోట్లకు దక్కించుకుంది.. సచివాలయంలోని జీఏడీ టవర్‌ను నిర్మించనుంది ఎన్ సీసీ లిమిటెడ్ సంస్థ.. ఇక, సచివాలయంలోని 1, 2, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ లిమిటెడ్ దక్కించుకుంది.. రూ.1,487.11 కోట్ల వ్యయంతో 1, 2 హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం కోసం బిడ్లు ఆమోదించింది ప్రభుత్వం..

Read Also: Allu Arjun: బన్నీ కోసం ‘అమెరికా బ్యాచ్’

మరోవైపు, ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3 ,4, హెచ్‌వోడీ టవర్లు నిర్మాణ పనులు లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ దక్కించుకుంది.. 1303.85 కోట్ల రూపాయల వ్యవయంతో 3, 4 హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం కోసం LIబిడ్లు ఆమోదించింది ప్రభుత్వం.. L1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్..

Exit mobile version