AP Government: అదానీ గ్రూప్‌కు కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అదానీ గ్రూప్ కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అదాని గ్రూప్‌నకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఇచ్చింది గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే, గిరిజనులకు దక్కాల్సిన ప్లాంట్లు అదానీ గ్రూప్ కు ఇవ్వడంతో వెనక్కు తీసుకుంది కూటమి సర్కార్.. మరోవైపు, తమ ప్రాంతానికి చెందిన గిరిజనులతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం.. అయినా, గత ప్రభుత్వం అదానీ గ్రూప్ కు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లను ఇవ్వగా.. వాటిని ఇప్పుడు రద్దు చేసింది కూటమి ప్రభుత్వం..
Read Also: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అదానీ గ్రూప్ యొక్క పెదకోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ను 1,000 నుండి 1,800 మెగావాట్లకు విస్తరించడానికి మరియు అనకాపల్లి జిల్లాలో రైవాడ PSP ని 600 నుండి 900 మెగావాట్లకు విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆమోదం పర్యావరణవేత్తల నుండి విమర్శలు వచ్చాయి.. జనవరి 2023లో సర్వే కోసం పెదకోట మరియు ఇతర గ్రామాలను సందర్శించిన సర్వే బృందాన్ని గిరిజనులు అడ్డుకున్నారు.. మరోవైపు, సామాజిక కార్యకర్త మరియు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి E.A.S. శర్మ… ఏపీ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు రాసిన లేఖలో, PESA చట్టం (పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ చట్టం, 1996) మరియు అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి స్థానిక గిరిజన ప్రజలను సంప్రదించకుండా ప్రాజెక్టు అనుమతులు ఏకపక్షంగా ఇవ్వబడ్డాయని ఆరోపించారు.. అదానీ గ్రూప్‌కు ఇచ్చిన ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి అనుమతించడమే కాకుండా, స్థానిక ప్రవాహం నుండి నీటిని జల ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారని మండిపడ్డారు.. గిరిజన ప్రజలకు ప్రత్యేక హక్కులను ఇచ్చే రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కింద పెడకోట ప్రాంతాన్ని నోటిఫై చేశారని శర్మ పేర్కొన్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదానీకి ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది..
