NTV Telugu Site icon

AP Education: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌ ఎత్తివేత..!

Ap Inter Board

Ap Inter Board

AP Education: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకు వస్తోంది.. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. CBSE సిలబస్ ప్రవేశ పెట్టె ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటాం అన్నారు కృతికా శుక్లా..

Read Also: BJP: ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరిపై బీజేపీ సీరియస్..

గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డ్ లో సంస్కరణలు జరగలేదు.. ప్రస్తుతం నాలుగు సంస్కరణలు ప్రధానంగా ఉన్నాయి అన్నారు కృతికా శుక్లా.. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదు.. ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరు అవుతారు.. వీరికి తగ్గట్టుగా కొత్త సిలబస్ తీసుకు రాబోతున్నాం అన్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ మార్పుపై దృష్టి పెట్టాం.. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీషు సిలబస్ మారుస్తున్నాం అన్నారు.. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ ఈ సిలబస్‌పై దృష్టి పెట్టిందన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ ఏదైనా అప్షన్ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉంది.. NCERT సిలబస్ వల్ల మాథ్స్.. కెమిస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుందన్నారు.. CBSE సిలబస్ ప్రకారం ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు.. ఇంటర్ లో ఇక నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్ మర్క్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు ఈ ఇంటర్నల్ మార్కులు ఉంటాయి.. 20 మార్కులు ఇంటర్నల్ గా ఉంటాయని వెల్లడించారు ఏపీ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా.