NTV Telugu Site icon

Pawan Kalyan Suffering With Viral Fever: పవన్‌ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్‌.. జ్వరంతోనే బెజవాడలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష

Pawan

Pawan

Pawan Kalyan Suffering With Viral Fever: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు.. ఫీవర్‌ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు పవన్‌ కల్యాణ్‌.. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోతే అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.. దోమల బెడద తీవ్రత ఉన్నందున.. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సభ్యులు సైతం వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్టుగా తెలుస్తోంది..

Read Also: Duleep Trophy: అన్న విఫలం.. తమ్ముడు శతకం

మరోవైపు.. బుడమేరు సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తిన తరుణంలో.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఎక్కడా? అంటూ వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్న తరుణంలో ఆయన ఘాటుగానే బదులిచ్చిన విషయం విదితమే.. నేను బయటకి రావడం లేదని వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారన్న పవన్‌.. ఈ విషయంపై నేను ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను.. నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతందని అధికారులు చెప్పారు.. వారి సూచనతో నేను వెనక్కి తగ్గానని క్లారిటీ ఇచ్చారు.. అలాఅని నేను ఏమీ చేయడం లేదని అనడం సరికాదన్నర ఆయన.. తాను వరదలపై సమీక్షలు చూస్తూనే ఉన్నానని వివరించారు.. ఇక, పవన్ కల్యాణ్‌ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించే వైసీపీ నేతలు నాతో ఒక్కసారి వచ్చి చూడండి.. నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. నేను బయటకు వెళ్తే ఎలా ఉంటుందో.. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకోవాలంటే.. నాతో పాటు రండి అంటూ పవన్‌ కల్యాణ్‌ వైసీపీ నేతలకు సలహా ఇచ్చిన విషయం విదితమే.