Deputy CM Pawan Kalyan: ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా.. ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు ప్రజా గాయకులు గద్దర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేం అన్నారు.. పీడిత వర్గాల గొంతుకగా గద్దర్ నిలిచారు. తన పాటనే అస్త్రంగా చేసుకొని గద్దర్ ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిల్చారు. పాటనే తూటాలుగా మలచి – తను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను తన రచనతో, తన గానంతో ఎలుగెత్తి చాటారు. బడుగు బలహీన వర్గాల కోసం గద్దర్ పోరాడారని గుర్తుచేశారు.
Read Also:UP Video: యూపీలో రెచ్చిపోయిన జంట.. కారులో వెళ్తూ చిల్లర చేష్టలు
తుది శ్వాస విడిచే వరకూ ప్రజా హక్కుల గురించే గద్దర్ ఆలోచించారని తెలిపారు పవన్.. ఈ సందర్భంగా గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. నెల్లూరు టౌన్ హాల్లో గద్దర్ గారిని తొలిసారి కలిసినప్పటి నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకూ ఆయనతో అనుబంధం కొనసాగిందన్నారు.. గద్దర్ అనే పేరు తలుచుకోగానే కాలికి గజ్జె కట్టి ఆడిపాడిన పాట గుర్తుకొస్తుందన్నారు.. అలాగే – ప్రజల గురించిన పాట బతికినంత కాలం గద్దర్ పేరు చిరంజీవిగానే ఉంటుందని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.