NTV Telugu Site icon

CM Chandrababu: వర్షం ఎఫెక్ట్‌.. సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్‌ అందిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా పర్యటించనున్నారు. అయితే, సీఎం చంద్రబాబు.. కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఆయన పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో పర్యటించాల్సి ఉండగా.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయ్యింది. దానికి బదులుగా ఓర్వకల్‌లో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు… అక్కడ ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత స్థానికులతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడుతారు. అనంతరం మధ్యాహ్నం 4గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Read Also: Samantha : ఇన్‌స్టాగ్రామ్‌ లో సమంత పోస్టుపై వణికిపోతున్నటాలీవుడ్.. కారణం ఇదే..?

కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. పెంచిన మొత్తన్నా కలిసి పెన్షన్లు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో.. వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు.. కానీ, ఇప్పుడు వాలంటీర్ల సపోర్ట్ లేకుండానే.. వారికి సంబంధం లేకుండానే.. నేరుగా ఇంటి వద్దకే వెళ్లి.. సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.. ఇక, సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఒక రోజు ముందుగానే.. పంపిణీ చేస్తున్నారు.