NTV Telugu Site icon

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం బిజీ.. నేడు డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీ, పోలవరంపై రివ్యూ..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉన్నారు. నిన్న ఉదయం సీఆర్డీఏపీ సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖపై రివ్యూ చేశారు. 2029నాటికి అర్హులందరికీ అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. PMAY 2.0 పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబరు నాటికి లక్ష ఇళ్లు పూర్తవుతాయని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రబాబుకు అధికారులు చెప్పారు. ఇక, ఈ రోజు కూడా కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. మొదట డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Nithin : నితిన్ కు ఊపిరి పోసిన సినిమా మళ్ళి వస్తోంది..

ఇక, సోమవారం రోజు అగ్రికల్చర్‌పైనా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించి అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలని సూచించారు. డ్రోన్లు వినియోగించి అనూహ్య ఫలితాలు సాధించొచ్చని చెప్పారు. రబీ నుంచి రైతులకు పాత పద్ధతిలో పంటల బీమా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖను అదేశించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెల్చిన క్రీడాకారులకు ఏడు కోట్ల రూపాయలు ప్రోత్సహకంగా అందిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఏపీ స్పోర్ట్స్ పాలసీపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీకి రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2నుంచి 3 శాతానికి పెంచారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో రూపొందిన నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.