Site icon NTV Telugu

CM Chandrababu Singapore Tour: రెండో రోజు చంద్రబాబు సింగపూర్‌ టూర్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Cbn

Cbn

CM Chandrababu Singapore Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన సింగపూర్‌లో కొనసాగుతోంది.. ఇవాళ రెండో రోజు సీఎం చంద్రబాబు మరింత బిజీగా గడపనున్నారు.. ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా.. పలు సంస్థల అధిపతులతో సమావేశంకానున్నారు.. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించబోతున్నారు.. భారత కాలమాన ప్రకారం ఉదయం 7 గంటలకు ట్రెజరీ బిల్డింగ్‌లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానుండగా.. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించనున్నారు.. ఇక, ఉదయం 8.30 గంటలకు ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరితోనూ చంద్రబాబు సమావేశం అవుతారు.. ఉదయం 9 గంటలకు హనీవెల్ సంస్థ ప్రతినిధులతో మీటింగ్‌ ఉండగా.. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.. ‘నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మరలడం : కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చ సాగనుంది.. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్శిటీ, సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ & డిజైన్ విద్యార్ధులు పాల్గొంటారు..

Read Also: Yogi Adityanath: అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్..

ఇక, ఉదయం 11 గంటలకు ఎవర్వోల్ట్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్‌తో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30కు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శన ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై దృష్టి సారించనున్నారు.. మధ్యాహ్నం 1 గంటకు టుయాస్ పోర్ట్ సైట్‌లో పర్యటన ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి మౌలిక సదుపాయాలపై PSA సీఈవో విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు.. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు చంద్రబాబు హాజరు కానున్నారు.. సింగపూర్, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.. సాయంత్రం 6 గంటలకు అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం ఉండగా.. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version