Site icon NTV Telugu

CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో ఏపీ సీఎం భేటీ.. పోలవరం రండి.. బనకచర్లకు అనుమతి ఇవ్వండి..!

Babu Cr Patil

Babu Cr Patil

CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక అంశాలపై చర్చించారు.. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరలు పాల్గొన్నారు.. అయితే, పోలవరం ప్రాజెక్ట్ కు నిధులుతో పాటు, బనకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతులుపై ఈ సమావేశంలో చర్చించారు.. బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కునే రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది.. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది..

Read Also: Gold Rate Today: లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటిన బంగారం ధర

గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచనగా ఉంది.. అయితే, దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ.. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు, ఆర్థిక సహకారాన్ని కోరుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తయ్యేలా సహకారం అందించాలని కూడా కేంద్రమంత్రిని కోరారు చంద్రబాబు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించాలని కేంద్రమంత్రిని ఆహ్వానించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

Exit mobile version