CM Chandrababu: పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం కీలక సమీక్ష
- ప్రభుత్వ పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం సమీక్ష..
- శాఖల వారీగా పురోగతిపై చర్చించిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. శాఖల వారీగా పురోగతిపై చర్చ జరిగింది… ఆర్టీజీఎస్ ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే నిర్వహించింది.. దీనిపై చంద్రబాబు సమీక్ష చేశారు.. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో చర్చించారు.. ప్రతి వారం నాలుగు శాఖలపై సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజల సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సమీక్ష చేశారు ఏపీ సీఎం..
Read Also: Air India flight: ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫ్లైట్ లో 322 మంది
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలన్న సీఎం.. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని ఆదేశించారు.. కరెప్షన్ అనేది ఒక జబ్బులాంటిది.. దానిని పూర్తిగా నివారించాల్సిందే అని స్పష్టం చేశారు.. అసెంబ్లీలో జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు..
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!