NTV Telugu Site icon

CM Chandrababu: పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం కీలక సమీక్ష

Cbn

Cbn

CM Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. శాఖల వారీగా పురోగతిపై చర్చ జరిగింది… ఆర్టీజీఎస్‌ ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే నిర్వహించింది.. దీనిపై చంద్రబాబు సమీక్ష చేశారు.. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో చర్చించారు.. ప్రతి వారం నాలుగు శాఖలపై సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజల సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సమీక్ష చేశారు ఏపీ సీఎం..

Read Also: Air India flight: ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫ్లైట్ లో 322 మంది

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలన్న సీఎం.. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని ఆదేశించారు.. కరెప్షన్ అనేది ఒక జబ్బులాంటిది.. దానిని పూర్తిగా నివారించాల్సిందే అని స్పష్టం చేశారు.. అసెంబ్లీలో జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు..