Site icon NTV Telugu

CM Chandrababu Davos Visit: మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..

Cbn

Cbn

CM Chandrababu Davos Visit: స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడో రోజూ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే ప్రత్యేక సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు.

Read Also: Trump: అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్‌పై ట్రంప్ వ్యాఖ్య

ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీలు
ఈ పర్యటనలో భాగంగా హొరైసిస్ ఛైర్మన్ ఫ్రాంక్ రిచర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఓఓ కుష్భు అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్‌లతోనూ సీఎం చర్చలు జరపనున్నారు. ఇక, పలు అంతర్జాతీయ సెషన్లలో సీఎం పాల్గొననున్నారు.. ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే “హీలింగ్ ప్లానెట్ త్రూ రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్” పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అలాగే “ట్రిలియన్ డాలర్ పైవోట్ – రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్” అంశంపై జరిగే మరో కీలక చర్చలోనూ పాల్గొననున్నారు.

బ్లూమ్‌బర్గ్ సెషన్‌లో ముఖ్య వక్తగా ప్రసంగం
బ్లూమ్‌బర్గ్ సంస్థ నిర్వహించే “ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ – ఏఐ మూవ్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ” అనే సెషన్‌లో సీఎం చంద్రబాబు ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు. కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆర్థిక మార్పులపై తన దృక్పథాన్ని వెల్లడించనున్నారు. ఇక, ఏపీ లాంజ్‌లో నిర్వహించే “బిల్డింగ్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్” కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వాతావరణ మార్పులు, పునరుత్పాదక అభివృద్ధిపై “ఫైనాన్సింగ్ రీజెనరేషన్ – మొబిలైజింగ్ క్యాపిటల్” అనే అంశంపై జరిగే మరో కార్యక్రమంలోనూ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. మొత్తంగా దావోస్ పర్యటన మూడో రోజున కూడా సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్‌తో వరుస సమావేశాల్లో పాల్గొంటూ, రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించారు.

Exit mobile version