Chandrababu and Pawan Kalyan in Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఢిల్లీ చేరుకున్నారు.. ఇద్దరు నేతలు విడివిడిగా హస్తినలో అడుగుపెట్టారు.. ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వివాహ రిసెప్షన్ కు వెళ్లనున్నారు.. ఇక, ఈ రాత్రి ఢిల్లీలోనే బసచేయబోతున్నారు.. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఒబెరాయ్ హోటల్‌లో “గేట్స్ ఫౌండేషన్” వ్యవస్థాపకులు, దాత బిల్ గేట్స్ తో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై.. విజయవాడ బయల్దేరనున్నారు..
Read Also: Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. దివాన్ చెరువు సమీపంలో ఫారెస్ట్ అకాడమీ..
మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు పవన్ కల్యాణ్.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను ఎవరినైనా కలుస్తారా? అనే సమాచారం తెలియాల్సి ఉంది..