CM Chandrababu in Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో శుక్రవారం భేటీ అయ్యారు.. రాష్ట్ర జీఎస్‌టీ సంబంధిత సర్చార్జి ఒక శాతం పెంచవలసిందిగా కోరారు ఏపీ సీఎం.. ఇక, గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. నదుల అనుసంధానంతో వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్ లోని క్షామ పీడిత ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు త్రాగు, సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు..
Read Also: CM Revanth Reddy: నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..
ఇక, అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు మరియు భారత ఆర్థిక రంగంపై ప్రభావం గూర్చి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి వెళ్తుండడంతో వారిపై అమెరికా నూతన ప్రభుత్వ విధానాల ప్రభావం గూర్చి చర్చించారు. దేశ ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి.. పెట్టుబడులు ఆకర్షించడంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ సహకారాలను కోరారు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ సమస్యలను విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెవెళ్లారు. మరోవైపు.. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించమని కోరారు. ఇక, నేడు ఉదయం హిందుస్థాన్ టైమ్స్ పత్రిక శత వార్షిక వేడుకలలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..