NTV Telugu Site icon

CM Chandrababu: కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం.. రెండు రోజుల కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందంటే..?

Babu

Babu

CM Chandrababu: రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని 26 జిల్లాలు, 40 డిపార్ట్మెంట్ లు పనితీరు, చేయాల్సిన పనులపై సమీక్షించారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎలాంటి ప్రణాళికలతో పని చేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది.. ప్రభుత్వం చేసినపాలసీలు, డిపార్ట్మెంట్ ల వారీగా తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగింది.. సమస్యలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు.. కొన్నింటికి పరిష్కారా దిశగా సూచనలు చేశారు. కొందరు అధికారుల, కొన్ని డిపార్ట్మెంట్ ల పని తీరుపై సీరియస్‌గా స్పందించారు.. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదటి రోజు ప్రధాన అంశాల చర్చలతో జరిగింది.. రెండు రోజుల కాన్ఫరెన్స్ లో మొదటి రోజు గూగుల్ తో ఒప్పందం జరగడాన్ని శుభపరిణామంగా సీఎం అభివర్ణించారు.. ఇసుక, పీడిఎస్ రైస్, గంజాయి, డ్రగ్స్ అంశాలపై చర్చ జరిగింది.. కలెక్టర్లు పాలసీలను అమలుచేయడానికి ఎలాంటి విధానాలు అవలంభించాలనే దానిపైనా చర్చించారు.. సీఎం, డిప్యూటీ సీఎం.. యువ కలెక్టర్లకు నూతనోత్సాహం కలిగించేలా ప్రసంగించారు.

Read Also: D Gukesh: చరిత్రకు చెక్‌మేట్‌ పడింది, నువ్వు ఓ అద్భుతం.. గుకేశ్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు!

ఇక, రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. వంద రోజులు పనిదినాలను సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందన్నారు సీఎం చంద్రబాబు.. పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి చేయలేక పోతున్నారని వాఖ్యానించిన సీఎం.. పల్లె పండుగలో 14.8 పర్సెంట్ మాత్రమే పనులు చేశారని ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉందన్న సీఎం.. అల్లూరి జిల్లాలో 54శాతం పూర్తైతే మరో జిల్లాలో 1.6 శాతం మాత్రమే పనులు జరగటంపై ప్రశ్నించారు.. మరోవైపు.. పరిశ్రమల శాఖపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్… ఎంతమంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు సీఎం.. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.. భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు.. ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని పేర్కొన్న సీఎం.. అమరావతి తరహాలోనే రైతులను పరిశ్రమలకు భూములిచ్చే అంశంలో భాగస్వాములను చేయాల్సిందిగా సూచనలు.. వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.. ఎంఎస్ఎంఈలను ఎన్యుమరేషన్ చేయించే పని త్వరితగతిన పూర్తి కావాలని సూచించిన సీఎం.. ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడి సరుకు అవుతుందన్నారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

20 లక్షల ఉద్యోగాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారన్నారు మంత్రి నారా లోకేష్… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి.. ప్రతీ పెట్టుబడి విషయంలోనూ కలెక్టర్లు జాగ్రత్తగా డీల్ చేయాలన్న మంత్రి లోకేష్… ఆర్సెలార్ మిట్టల్ కు ఎన్ఎండీసీ ముడి ఇనుము ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.. పైప్ లైన్ ద్వారా ముడి ఇనుము ఖనిజం వచ్చేలా చేయాలని కోరుతున్నారని తెలిపారు.. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం ఉక్కుమంత్రికి, ఎన్ఎండీసీ కి స్వయంగా నేనే ఫోన్  చేసి ఫాలోఅప్ చేస్తున్నాన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్లు కూడా పెట్టుబడుల విషయంలో ఇదే తరహాలో సీరియస్ గా ఫాలోఅప్ చేయాలని సూచించారు.. నేను మంత్రిని, కలెక్టర్ ను అంతా నా దగ్గరకే రావాలన్న ఆలోచన వదిలేయాని సూచించార సీఎం‌.. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన ఇబ్బందుల కారణంగా ఏపీకి మళ్లీ రాబోమని వెళ్లిపోయారని దాన్ని సరిదిద్దేందుకు నానా తంటాలు పడుతున్నామని సీఎం వ్యాఖ్యానించారు‌.. ప్రాజెక్టు ఆలస్యమైతే వారికి వయబిలిటీ విషయంలో ఇబ్బందులు వస్తాయని ఆ కారణంగా ఇతర రాష్ట్రాలవైపు వారు చూసే అవకాశం ఉందన్నారు.. అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై పదేపదే చెబుతున్నట్టు వెల్లడించారు. పర్యాటకం కూడా ఉపాధి కల్పనలో కీలకం అన్నారు..

Read Also: New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..

రాజధాని అమరావతి వేగంగా అభివృద్ది చెందే నగరం అన్నారు సీఎం… విజయవాడ- గుంటూరు లాంటి సిటీలు అమరావతిలో కలిసిపోతాయన్న సీఎం.. దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.. అర్బనైజేషన్ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా అవుటర్ రింగ్ రోడ్ వెలుపల మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీచేశారు.. ఏపీకి 20 శాతం మేర వృద్ధి రేటు సాధించేందుకు వీలుగా పర్యాటకం పెరగాలి.. 7 యాంకర్ హబ్స్, 25 థీమాటిక్ సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న సీఎం… బీచ్ రిసార్టులు, అటవీ ప్రాంతాలు, దేవాలయాలు, గండికోట గ్రాండ్ కాన్యాన్ లాంటి భౌగోళిక వనరుల్ని వినియోగించుకోవాలన్నారు.. ఏపీలో ఉన్న సహజ అందాలను మనం మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం, తిరుపతి లాంటి అత్యధిక ఆధ్యాత్మిక ప్రాంతాలను కూడా గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.. రాజధానికి సంబంధించిన 15 వేల కోట్ల రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు తమ బోర్డు మీటింగ్ లో క్లియర్ చేసిందని గుడ్ న్యూస్‌ చెప్పారు‌.. డిసెంబర్‌ 19 తేదీన ప్రపంచబ్యాంకు బోర్డు కూడా అమరావతి రుణంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.. జనవరి నాటికి 31 వేల కోట్ల రుణం అమరావతి నిర్మాణానికి అందుబాటులోకి వస్తుందన్నారు.. ఈ ఆర్నెల్లలో  విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణించాం.. రాష్ట్ర పునర్నిర్మాణంలో జిల్లా కలెక్టర్ల బాధ్యత చాలా ఉంది.. ఇప్పటికి కూటమి ప్రభుత్వ పాలన మొదలై ఆర్నెల్లు గడిచింది.. హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్ గవర్నెన్సు ఉండాలి.. రెడ్ కార్పెట్లు లేకుండా చాలా సులభతరమైన పాలన అందిస్తున్నాం.. సంక్షోభాలు, సవాళ్లలోనే అవకాశాలు వెతుక్కుంటున్నాం.. ఆర్థికేతర సమస్యలు అన్నీ పరిష్కారం కావాలి.. ప్రాధాన్యతా పరంగా ఆర్థికపరమైన అంశాలు కూడా పరిష్కారం అవుతాయి.. ప్రజల్లో సానుకూల ధోరణిని కలిగించేలా పాలన కొనసాగాలి.. ఇంకా పాలనలో కొంత నిర్లక్ష్యం, ఇబ్బందులు ఉన్నాయి వాటిని తొలగించుకోవాలి.. డబ్బులు అవసరమే అయినా పాలనలో వినూత్నమైన పరిష్కారాలు కూడా అవసరం అన్నారు సీఎం..

Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఒకే ఒక్క సెంచరీ! ఇదే చివరి అవకాశం

ఆర్ధికపరంగా ఇబ్బందులు ఉన్నా ఆత్మవిశ్వాసంతోనే పనిచేస్తున్నాం… సూపర్ సిక్స్ లో కొన్ని అమలు చేసినా మరికొన్నిటిని అమలు చేయాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు. మానిఫెస్టోలో చెప్పిన అంశాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి.. వాటిని సమర్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే.. వీటిని అమలు చేసి ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అయ్యేలా చూడాలి.. ప్రజాసేవకులం కాని పెత్తందార్లు కాదని గుర్తించాలి.. ప్రతీ మూడో శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా నిర్దేశించాం.. ఇప్పటికే 25 విధానాలు ప్రకటించాం.. మరో నాలుగైదు విధానాలు కూడా రూపోందిస్తాం.. వాట్సప్ గవర్నెన్సు త్వరలోనే అమలు చేస్తాం.. సీసీ టీవీ, డ్రోన్లు, ఐఓటీ, ఫోన్లు, ఏఐ లాంటి సాంకేతికతను వాడుకుని మెరుగైన పాలన అందించాలి.. ప్రతీ అంశంలోనూ వ్యయం తగ్గించగలిగితే సుస్థిరత వస్తుంది‌. ప్రజల ప్రాణాలు, ఆస్తులు శాంతిభద్రతలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి అని సూచించారు.. భూఆక్రమణల కేసులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు.. మహిళలపై జరిగే నేరాల్లోనూ కఠినంగానే వ్యవహరించండి… సంక్షేమంతో పాటు అభివృద్ది ముఖ్య… రేషన్ బియ్యం స్మగ్లింగ్ కట్టడి చేయాల్సిందే… అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీగా మారటంలో ఎలాంటి సందేహం లేదన్నారు.. ఏదేమైనా.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొత్తం ఒక వైపు నాలెడ్జ్ షేరింగ్ మరోవైపు సీఎం చంద్రబాబు హెచ్చరికలతో రెండు రోజులపాటు ఆరు నెలల పాలన, తదుపరి నాలుగున్నర నెలల కాలానికి ప్రణాళిక లాగా జరిగింది..

Show comments