Site icon NTV Telugu

CM Chandrababu: డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఎలా ఉంటుందో చూపించాం.. ఇదే జోరు కొనసాగిద్దాం..

Babu

Babu

CM Chandrababu: డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఎలా ఉంటుందో ఈ ఏడాది కాలంలోనే చూపించామన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సదస్సు జరిగింది.. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్.. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు హాజరయ్యారు.. ఏడాది సంక్షేమంపై సమీక్ష… అభివృద్ధిపై అవలోకనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఏడాది పాలన పై చర్చించు కుంటున్నాం… సూపర్ సిక్స్ లో ఎన్నికల హామీలు ఇచ్చాము. ప్రజలకు అనేక రకాల కోరికలు ఉంటాయి. ప్రభుత్వం ప్రజలను దృష్టి లో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అస్తవ్యస్తం గా ఉన్న ఆర్ధిక వ్యవస్థ ను చక్క బెట్టే ప్రయత్నం చేస్తున్నాం.. అన్ని చేశామని చెప్పడం లేదు… ఊహించిన దాని కన్నా ఎక్కువ చేసాం. ఇంకా క్లిష్టమైన సమయంలో కూడా నేను సీఎం అయ్యాను.. 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు బస్సులో కూర్చుని పరిపాలన చేశాను అని గుర్తు చేసుకున్నారు..

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

మూడు రాజధానులు ఎక్కడా సక్సెస్ కాలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. చివరకు రాష్ట్రానికి కేపిటల్‌ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి.. ఆదాయం పెంచితేనే సంక్షేమ పథకాలు అమలు చేసే హక్కు ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. 2022-23 సంవత్సరానికి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని నీతి ఆయోగ్‌ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. మరోవైపు, వైసీపీ హయాంలో ల్యాండ్‌ రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఏడాది వ్యవధిలో ల్యాండ్‌ రికార్డులన్నీ తనిఖీ చేసి..అర్హులకు పట్టాలు ఇస్తామన్నారు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నీటి సమస్య పరిష్కారం అవుతుంది.. నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రానికి నీటి సమస్య ఉండదు.. గత ప్రభుత్వం ఎంత సేపూ అణగ దోక్కాలని చూసిందన్నారు.. 2022 23 లో నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం అప్పు ల్లో ఉంది. రాష్ట్రంలో ల్యాండ్ రిఫామ్స్ కు సంబంధించి కొత్త చట్టాలు వస్తున్నాయి.. రాబోయే ఒక సంవత్సరం ల్యాండ్ రికార్డుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. అమరావతి కి 15 వేల కోట్ల రూపాయల అప్పు కేంద్రం ఇచ్చింది.. పోలవరానికి నిధులు కేటాయిస్తూ న్నారు.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం…తల్లికి వందనం అమలు చేశాం.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇచ్చాము.. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది.. మొదట ఏడాది గ్రోత్ రేట్ పెరిగింది.. వాట్సాఅప్ గవర్నెన్స్ ప్రారంభించాం అన్నారు..

Read Also: ENG vs IND: లీడ్స్‌ టెస్ట్‌లో సెంచరీల మోత.. ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ రికార్డ్

25 కేబినెట్‌ సమావేశాలు ఇప్పటి వరకు పూర్తి అయ్యాయి.. గంజాయి నిర్ములన చేయగలిగాం.. గంజాయిని అమ్మితే అదే చివరి రోజు అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.. ఆ దిశగా పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. మూడేళ్ళ ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు. రాజకీయ ముసుగులో నేరాలు చెయ్యాలంటే కుదరదు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన లిక్కర్ పాలసీ ఏపీలో ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్.. ఒకప్పుడు హైదరాబాద్.. ప్రభుత్వ భూములు ఉన్నాయి.. సైబరాబాద్ ప్రాజెక్ట్ చేసాము. రాబోయే మూడేళ్ళలో అమరావతిని ఒక స్టేజ్ కు తీసుకు వస్తాం అన్నారు చంద్రబాబు.. ఇక, అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దే అన్నారు.. అదే విధంగా లోకేష్ టీచర్ పేరెంట్ మీటింగ్ పెట్టారు.. మనతో పుట్టిన వారిని.. మన తోటి వారిని ఆదుకోవడం మన బాధ్యత.. అందుకే పి..4 ను తీసుకొచ్చాం.. వేదాంత 75 శాతం సంపద సమాజానికి ఇచ్చింది. అంతర్జాతీయ యోగా డేను గ్రాండ్ సక్సెస్ చేసాం.. 3 లక్షల మందిని యోగ లో భాగస్వామ్యం చేసి గిన్నీస్ రికార్డ్ సాధించాం అన్నారు..

Exit mobile version