NTV Telugu Site icon

CM Chandrababu Delhi Tour: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

Cbn

Cbn

CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. ఓ వైపు సమీక్షలు.. మరోవైపు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు.. ఇక, సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్లనున్నారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 5.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రికి అక్కడే బస చేస్తారు.. ఇక, గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా సహా అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది..

Read Also: Nepal: పుష్ప కమల్ దహల్ ప్రచండకు పదవీ గండం.. నేపాల్లో కూలనున్న సంకీర్ణ సర్కార్..?

అయితే, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి కూడా హస్తినకు వెళ్లనున్నారు.. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు, అమరావతి రాజధాని లాంటి అంశాలపై ఢిల్లీ పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు..

Read Also: Off The Record : సౌమ్యంగా ఉండే ఆ బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే ఒక్కసారిగా బూతుపురాణం అందుకున్నారా?

మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండబోతోంది.. కేంద్రం నుంచి ఏయే స్కీములు, ప్రాజెక్టులను రాబట్టొచ్చనే అంశంపై ప్రధానంగా చర్చ జరిపారు. మౌళిక వసతులకు వీలైనన్ని నిధుల రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు సీఎం చంద్రబాబు.