NTV Telugu Site icon

CM Chandrababu: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయండి..

Cbn

Cbn

CM Chandrababu: ఏపీ సచివాలయం వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఓసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్న ఆయన.. అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.. పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.. ప్రజా సమస్యల పరిష్కారం గురించి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాల్సిందేనని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. ఇకపై ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ లను డ్రైన్లలోకి దింపానని నాటి విషయాలను గుర్తు చేసిన సీఎం. పాలనలో నిబంధనల వైపే కాకుండా మానవత్వ కోణంలో పనిచేయాలని సూచించారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబరు 2 తేదీన విడుదల చేస్తామన్నారు. 2047 కోసం జిల్లాలకూ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచనలు చేశారు. ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లకు, అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Read Also: Tech Tips: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలంటే ఈ టిప్స్ పాటించండి?

ఐఏఎస్‌ల వ్యవస్థను దిగజార్చేలా గత ఐదేళ్లలో పాలన సాగిందన్న సీఎం చంద్రబాబు.. వైసీపీ పాలన వల్ల ఢిల్లీలో ఐఎఎస్సులను అంటరానివారుగా చూశారన్నారు.. ఒకప్పుడు ఏపీ అధికారులంటే ఎంతో గౌరవం ఉండేది, కీలక పదవుల్లోకీ వెళ్లారన్న చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లదే కీలక బాధ్యత అన్నారు.. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని వెంటనే ఖండించాలన్నారు.. కొందరు ఫేక్ ఫెలోస్ ఉన్నారు.. వారి ఆటలు కట్టిపెట్టాలి. రాజకీయ కక్ష సాధింపు ఉండదు కానీ.. తప్పు చేస్తే వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు.. 36 రాజకీయ హత్యలు చేశారని అసత్య ప్రచారం చేశారు. 36 రాజకీయ హత్యల వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు అని మండిపడ్డారు. అక్టోబర్-2వ తేదీన ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేస్తున్నాం. జిల్లాల్లో కూడా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు.. ఇక, సూపర్-6కు కట్టుబడి ఉన్నాం. ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేస్తున్నాం. ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తాం అన్నారు.

Read Also: Iran Israel Tension: ఇరాన్ దాడిని తట్టుకునేందుకు 20ఏళ్ల క్రితమే ప్లాన్ వేసిన నెతన్యాహు

ఇక, త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తా. 1995 సీఎంని చూస్తారు. అంగన్వాడీలకు పోతా.. డ్రైన్లను పరిశీలిస్తాను అన్నారు సీఎం చంద్రబాబు.. డ్రైన్లల్లోకి ఐఏఎస్‌లను కూడా దింపాను. డ్రైన్ల పరిస్థితి చూడండి అని అధికారులను పంపాను. పని చేసే బాధ్యత అధికారులది.. పని చేయించే బాధ్యత మాది. దీన్ని అధికారులందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. నియంతలు మళ్లీ అధికారంలోకి రాలేదు. మేం తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేం.. అసెంబ్లీకీ రాలేం. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు అసెంబ్లీకి కూడా రాలేకపోయారు. పరదాలు కట్టడం.. రోడ్లు బ్లాక్ చేయడం వంటివి చేయొద్దు.. టెక్నాలజీని వినియోగించుకోవాలి. అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని అనుసంధానం చేస్తూ యాప్ క్రియేట్ చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.