Jathwani Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్ దాఖలు చుఏసింది.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, పోలీసులు, న్యాయవాది. .. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అఫిడవిట్‌లో సీఐడీ పేర్కొంది.. అయితే, జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేశారని అఫిడవిట్ లో పేర్కొంది సీఐడీ.. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాలు మేరకు ఇదంతా జరిగింది తెలిపింది సీఐడీ.. ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా ముంబైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారని అఫిడివిట్ లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు.. అయితే, వీళ్లకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందన్న అఫిడవిట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు..
Read Also: Belly fat: రోజూ నిద్రించే ముందు మీ బెడ్‌పైనే ఈ రెండు వ్యాయామాలు చేయండి.. బెల్లీ ఫ్యాట్ తగ్గడం ఖాయం?
మరోవైపు, బెయిల్ పిటిషన్లపై తుది విచారణను సోమవారం చేపడతామని ఇప్పటికే ఇప్పటికే స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అయితే, జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేశారని అఫిడవిట్‌లో సీఐడీ అధికారులు వివరించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని.. సీఐడీ అధికారులు చెప్పారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా ముంబైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారని సీఐడీ అభియోగాలు మోపింది.. కాగా, ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేసిన విషయం విదితమే.. ఇక, డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడింది. అయితే, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే..