AP Chief Secretary: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా కొత్త సీఎస్‌ను నియమించాలా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం చూస్తే ప్రస్తుత ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ మరియు సీఎం ఆఫీస్‌కు ప్రత్యేక సీఎస్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజయానంద్ రిటైర్ అయిన పక్షంలో సాయి ప్రసాద్‌కు సీఎస్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయతే, కొత్త సీఎస్ నియామకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విజయానంద్ కొనసాగింపు అవకాశం ఉందా? లేక సాయి ప్రసాద్ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారా? అనే అంశంపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతున్నా.. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
Read Also: RGV-Rajamouli : ‘‘నాస్తికుడు వల్ల దేవుడి స్థాయి తగ్గదు” – జక్కన్న తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్ వైరల్
కాగా, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన కె.విజయానంద్ అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సీఎస్‌గా ఉన్న నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీ విరమణతో విజయానంద్ ఆ బాధ్యతలు తీసుకున్నారు.. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ 1993లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. సబ్ కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు. 2019-21 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు. 2023 నుంచి ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా సేవలు అందించారు. ఆ తర్వాత సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నారు.. అయితే, ఇప్పుడు విజయానంద్‌ను కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది..
