AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అజెండా ఇదే..

  • నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..
  • ఉద‌యం 11 గంట‌ల‌కు సచివాలయంలో సమావేశం..
  • కేబినెట్ ముందు కీలక అంజెడా..
Cabinet

Cabinet

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి ఇవ్వనుంది కేబినెట్‌.. మరోవైపు, హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ఏర్పాటుపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం, మంత్రులు.. ఇక, అమ‌రావ‌తిలో ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపులకు అమోదం తెలపనుంది కేబినెట్‌.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారి.. కేంద్రం వరకు చేరిన బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించనున్నారు.. మరోవైపు, సుపరిపాలన… తొలి అడుగు ఫీడ్ బ్యాక్ పై కేబినెట్‌ తర్వాత మంత్రుల తో చర్చించనున్నారట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..