NTV Telugu Site icon

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే, ఏపీ సర్కార్‌ మరోసారి పేపర్‌ లెస్‌ విధానాన్ని అవలంభిస్తోంది.. ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ ఇవాళ్టి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు అంతా ఆన్ లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. కేబినెట్‌ ప్రారంభం కాగానే ఈ-కేబినెట్ విధానం అమలుపై మంత్రులకు డెమో ఇవ్వనున్నారు ఎన్ఐసీ అధికారులు.

Read Also: Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే ఏ కష్టాలు, చింతలు లేకుండా సాగుతుంది..

ఇక, ఈ కేబినెట్‌ సమావేశంలో కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. సెబ్ రద్దుపై మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా.. ఎక్సైజ్ కొత్త పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు మంత్రులు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణపై కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండీయూ వాహానాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది… ఏపీ విజన్ డాక్యుమెంట్-2047పై మంత్రివర్గంలో చర్చ సాగనుండగా.. ఇసుక విధానం అమలు తీరుపై కేబినెట్‌ సమీక్షించనుంది.. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై విచారణలపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.