Site icon NTV Telugu

AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: మరోసారి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఏపీ కేబినెట్‌ భేటీకానుంది.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న మంత్రివర్గ సమావేశంలో.. కీలక అంశాలపై చర్చించనున్నారు మంత్రులు.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన, ఏర్పాట్లపై చర్చించనుంది ఏపీ కేబినెట్. ఈ నెల 16వ తేదీన ఏపీ పర్యటనకు రానున్నారు ప్రధాని మోడీ.. ఈ పర్యటనలో శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత జీఎస్టీపై అవగాహన కల్పించేలా కర్నూలులో ర్యాలీ నిర్వహించనున్నారు.. ఇక, జీఎస్టీకి సంబంధించి ఎన్డీఏ వరస కార్యక్రమాలు నిర్వహస్తోన్న విషయం విదితమే..

Read Also: IBOMMA : మాతో పెట్టుకోవద్దు.. పోలీసులకు ఐ బొమ్మ స్వీట్ వార్నింగ్

మరోవైపు, ఏపీలో జీఎస్టీ కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.. అమరావతి రాజధాని నిర్మాణం.. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరగనుంది.. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది.. కేబినెట్‌ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారట సీఎం చంద్రబాబు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరు.. కొంతమంది ఎమ్మెల్యేల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..

Exit mobile version