NTV Telugu Site icon

AP Cabinet Key Decisions: కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్‌ సిగ్నల్‌..

Cabinet

Cabinet

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మంత్రులంతా హాజరైన కేబినెట్‌ సమావేశంలో.. పలు అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది కేబినెట్‌.. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది.. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం లభించింది.

Read Also: New Social Media Policy: యూపీలో కొత్త సోషల్ మీడియా పాలసీ.. ఆమోదం తెలిపిన క్యాబినెట్..!

ఇక, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది ఏపీ కేబినెట్‌.. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు కేబినెట్ ఆమోదం లభించగా.. 21.86 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఓకే చెప్పింది.. 77 లక్షల సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.. 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆమోదం లభించగా.. వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Read Also: TG Venkatesh: ఆవేశంతో బీజేపీ పెద్దలపై కవిత స్టేట్‌మెంట్లు కరెక్ట్‌ కాదు..!

రాష్ట్రంలో కొత్తగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ -పోస్ మిషన్ ల కొనుగోలుకు రూ. 11.51 నిధులు విడుదలకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.. సార్టెక్స్ బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో పోర్టిఫైడ్ బియ్యం అందించేందుకు కేబినెట్‌లో చర్చసాగింది.. పోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయడం వల్ల రూ. 330 కోట్లు ఆదా అవుతాయని అంచనావేసింది.. సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి ఆమోదం లభించగా.. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. విజన్ 2047 రూపకల్పన పై కేబినెట్‌లో చర్చ సాగింది.. కొత్త మద్యంపాలసీ తెచ్చే అంశంపై కేబినెట్‌ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి.. ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపై కేబినెట్‌ ముందుకు ప్రతిపాదనలు పెట్టారు..