AP Cabinet Kkey Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలపగా.. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది.. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష సంఘం….’గా మార్పునకు ఆమోదముద్ర పడింది.. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం లభించగా.. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది..
Read Also: BSNL Triple Play Services: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.400కే ట్రిపుల్ ప్లే సర్వీసెస్..
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి.. ఇవాళ కేబినెట్ సమావేశంలో 33 అంశాలకు ఆమోదం లభించింది.. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ.. 4.0 ప్రతిపాదనకు కేబినెట ఆమోదం తెలిపింది అన్నారు.. వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి.. చెత్త నుంచి సంపద సృష్టికి సంబంధించిన పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు.. పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వ్యర్థాలని రిసైక్లింగ్ కి వాడుకునే విధంగా చెత్త నుంచి సంపదని సృష్టించే విధంగా మంత్రివర్గం అమోదించిడం జరిగిందని.. దీని ద్వారా MSME పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు ఉపయోగపడనుందని వెల్లడించారు.. టూరిజం అభివృద్ధిలో భాగంగా భూ కేటాయింపులకి కేబినేట్ ఆమోదం తెలిపిందని.. వీటి ద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు మంత్రి కొలుసు పార్థసారథి..
Read Also: 2025@1000Cr: వెయ్యి కోట్ల బొమ్మ అదొక్కటేనా?
ఇక, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం మార్పు చేసే నాలా చట్టాన్ని రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు పార్థసారథి.. భూ మార్పిడి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధి కి వినియోగించాలి… గుంటూరులోని మున్సిపల్ భూమిని టిడిపి పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాలు లీజుకు ఇవ్వడానికి, ఎకరానికి 1000 రూపాయల చొప్పున దీన్ని 99 సంవత్సరాలు పాటు పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.. 44 ప్యాకేజీ ప్రకారం అమరావతిలో పనులను L1 బిడ్డర్ల కు ఇవ్వటం కోసం ఆమోదం లభించింది.. అమరావతి రాజధాని చుట్టూ ఉన్న 25 గ్రామాల పరిధిలో రాజధాని తో సమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఆమోదం తెలిపారు.. SRM 11 వేల మంది విద్యార్థులు, VIT 17 వేల మంది విద్యార్థులు.. ఉన్న కళాశాలకు అదనంగా భూమి కేటాయిస్తూ 100 కోట్లు ఎకరా 2కోట్ల కు కేటాయించడం జరిగిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి..
