Site icon NTV Telugu

AP BJP: అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌..!

Modi

Modi

AP BJP: మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నారు.. అయితే‌.. ప్రధాని రాకను కూటమి పార్టీలు తమ స్టైల్ లో వినియోగించుకుంటున్నాయట.. బీజేపీ సైతం భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించిందట.. ప్రతీ జిల్లా నుంచి కో-ఆర్డినేటర్లను సిద్ధం చేసారట.. అలాగే ప్రధానంగా బీజేపీ లుక్ కనిపించేలా చూడాలని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారట.. కూటమి పార్టీలలో ప్రతీ విషయంలో కూటమి ధర్మం పేరిట వెనక ఉండిపోయిన బీజేపీని ముందుకు తీసుకురావడానికి మోడీ రాకను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేసారట.. క్షేత్రస్ధాయి బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ బీజేపీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిగా ప్రణాళిక వేసుకుందని సమాచారం.. అమరావతి నుంచి పోలవరం దాకా ప్రతీ అంశంలోనూ బీజేపీ సహకారం ఎంత ఉందో చూపించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారట…

Read Also: AP Capital Amaravati: అమరావతి రాజధానికి చట్టబద్ధత..!

బీజేపీ శ్రేణులను భారీస్థాయిలో సిద్ధం చేసి, కాషాయ జెండాలు కనిపించేలా చేయాలని కోర్ కమిటీ సమావేశంలో సూచించారట.. ఏపీలో బీజేపీ ఏం చేసింది, కేంద్రం ఇచ్చిన పథకాలు, చేస్తున్న అభివృద్ధి తెలిపేలా ఉండాలని నిర్ణయించారట.. దీంతో కూటమిలో బీజేపీ ఎంత బలమైన స్ధానంలో ఉందో చూపించాలనే ఈ ప్రణాళికలు అని చర్చించుకుంటున్నారట కేడర్.. మరోవైపు అమరావతి ఏపీ రాజధానిగా గుర్తించామనే విషయాన్ని కూడా చూపించబోతున్నారట.. ఏపీలో బీజేపీ స్ధానాన్ని బలపర్చుకోవడానికి మే 2ను పూర్తిస్ధాయిలో ఎంతవరకూ వినియోగించుకుంటుందో చూడాలి మరి..

Exit mobile version