పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ప్రసంశలు కురిపించారు. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అంటూ కితాబు ఇచ్చారు. ఈ మేరకు ఆమె ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆర్ధికవృద్ధిని, దేశ అభివృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్ అంటూ కొనియాడారు. ముఖ్యంగా భారతదేశ వృద్ధిలో కీలకంగా వ్యవహరించే మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత ఇలా అన్ని రంగాలను ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉందని పురందేశ్వరి తెలిపారు.
ఇది కూడా చదవండి: Gunfire : హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: మోసం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రశంసలు కోరుకుంటున్నారు