BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

Ap Bc Reservations Case

Ap Bc Reservations Case

BC Reservations Case: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఏపీ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పు సహేతుకంగానే ఉందని ధర్మాసనం పేర్కొంది.. బీసీ రిజర్వేషన్ల నిర్ణయంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పరిణామంతో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో ఆశించిన ఫలితం దక్కలేదు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఈ అంశంపై న్యాయపరమైన చర్చ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.