NTV Telugu Site icon

AP Assembly Budget Session: మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

Assembly Budget Session

Assembly Budget Session

AP Assembly Budget Session: మార్చి 19వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.. మొత్తంగా 15 వర్కింగ్ డేస్ లో సమావేశాలు జరగనున్నాయి.. అవసరం అయితే మరో రెండు రోజులు పొడిగించాలని బీఏసీలో నేతలు అభిప్రాయపడ్డారు.. అయితే, వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభం అయ్యాయి.. ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారన్నారు గవర్నర్.. అబ్దుల్ నజీర్.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు…8 నెలల పాలన…భవిష్యత్తు లక్ష్యాలు వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని గవర్నర్ తన ప్రసంగం లో వివరించారు. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని.. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారన్నారు గవర్నర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం అన్నారు..

Read Also: YS Avinash Reddy: పులివెందుల ఉప ఎన్నిక కాదు.. మంగళగిరి, పిఠాపురం, కుప్పం సిద్ధమా..?

ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని… ప్రతినెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం అన్నారు గవర్నర్. పెన్షన్లు రూ.4వేలకు పెంచామని…పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం.. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు.. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం అని తెలిపారు.. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం…అని.. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశాం. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష తో ప్రభుత్వం ఉందన్నారు.. ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీరు, విద్యుత్‌ అందిస్తున్నాం అని.. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు… సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం…అన్నారు గవర్నర్ నజీర్… ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం. జరిగింది.. సభను వచ్చే నెల 19 వరకు జరపాలని బీఏసీ లో నిర్ణయించారు.. అవసరం అయితే మరో రెండు రోజులు పాటు రిజర్వ్ లో ఉంచారు….15 వర్కింగ్ డేస్ సభను జరపాలని డిసైడ్. అయ్యారు….