NTV Telugu Site icon

AP Assembly Session 2025 Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌

Ap Assembly

Ap Assembly

AP Assembly Session 2025 Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తున్నారు.. ఇక, గవర్నర్‌ ప్రసంగం తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 28న తేదీన సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది కూటమి సర్కార్.. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరుకానున్నారు. మరోవైపు.. కూటమి పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశాయి..

  • 24 Feb 2025 11:29 AM (IST)

    మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ హాల్‌మార్క్‌గా మారేలా కృషి.

    మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ హాల్‌మార్క్‌గా మారేలా కృషి చేస్తున్నాం అన్నారు గవర్నర్.. రైతులకు కనీస మద్దతుధరను స్థిరపరిచేలా ప్రణాళిక.. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ ద్వారా టమాటా, మిర్చి రైతులకు మద్దతు ధర.. 15,948 గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌గా ప్రకటించాం..70 శాతం గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ అమలు చేస్తున్నాం.. 7,559 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి అన్నారు.

  • 24 Feb 2025 11:29 AM (IST)

    10 పోర్టులను ప్రపంచస్థాయి పోర్టులుగా తీర్చిదిద్దుతున్నాం

    10 పోర్టులను ప్రపంచస్థాయి పోర్టులుగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు గవర్నర్.. 2029 నాటికి వైజాగ్‌లో 46.23 కి.మీ. మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌.. 38.40 కిమీ నెట్‌వర్క్‌తో విజయవాడ మెట్రో రైల్‌ నిర్మాణం జరుగుతందని తెలిపారు

  • 24 Feb 2025 11:28 AM (IST)

    దేశంలో ఆక్వారంగంలో ఏపీకి తిరుగులేదు

    దేశంలో ఆక్వారంగంలో ఏపీకి తిరుగులేదు అన్నారు గవర్నర్.. నిజాంపట్నంలో రూ.88.08 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాపార్క్‌.. ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం.. ధాన్యం సేకరణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతోంది.. ఏపీని అత్యుత్తమ లాజిస్టిక్‌ కలిగిన రాష్ట్రంగా మారుస్తాం అన్నారు

  • 24 Feb 2025 11:10 AM (IST)

    2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదు.

    2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదు అని స్పష్టం చేశారు ఏపీ గవర్నర్.. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్ ఏర్పాటు.. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ చేస్తున్నాం అన్నారు..

  • 24 Feb 2025 11:09 AM (IST)

    గుంతలులేని రోడ్ల నిర్మాణంలో అద్భుతమైన పురోగతి

    4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లను మంజూరు చేశాం.. గుంతలులేని రోడ్ల నిర్మాణంలో అద్భుతమైన పురోగతి సాధించామన్నారు గవర్నర్.. 20,059 కి.మీ.కి గాను 3 నెలల్లోనే 27,605 కి.మీ. రోడ్ల పని పూర్తి చేశాం.. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే లక్ష్యం పెట్టుకున్నాం.. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సృష్టిపై ఫోకస్‌ పెట్టామని తెలిపారు..

  • 24 Feb 2025 11:08 AM (IST)

    2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం..

    గత ఐదేళ్లలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు గవర్నర్.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరంతో లింక్‌ చేస్తున్నాం.. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం.. బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు ప్రయోజనం.. హంద్రీనీవా సుజల స్రవంతి పనులు వేగంగా సాగుతున్నాయి.. వెలిగొండ ప్రాజెక్టు 75 శాతం పూర్తైంది.. ఏ రైతుకు సాగునీటి ఇబ్బందులు ఉండకూడదు.. ఎకరం భూమి కూడా నిరుపయోగంగా ఉండకూడదు.. వ్యవసాయం రైతులకు మరింత లాభదాయకండా మారేలా చర్యలు తీసుకుంటాం.. భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకున్నామన్న గవర్నర్‌

  • 24 Feb 2025 11:07 AM (IST)

    స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు

    స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాం.. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నాం.. తల్లి దండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా తల్లికి వందనం.. తొలిసారిగా స్కిల్‌ సెన్సెన్స్‌ నిర్వహిస్తున్నాం.. ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది మా లక్ష్యం.. విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు గవర్నర్‌

  • 24 Feb 2025 11:06 AM (IST)

    2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం

    2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం అని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఏపీ గవర్నర్.. ప్రతి నెలా 1నే ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నాం.. బీసీ ప్రొటెక్షన్‌ యాక్ట్ తీసుకువస్తున్నాం.. ఏటా 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేలా దీపం-2 స్కీమ్‌ను తీసుకొచ్చాం.. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నది లక్ష్యం.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెడుతోందన్నారు..

  • 24 Feb 2025 10:26 AM (IST)

    అభివృద్ధి, సంక్షేమం నాణేనికి రెండు వైపుల లాంటిది..

    గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం పెరిగిందిన తన ప్రసంగంలో పేర్కొన్నారు ఏపీ గవర్నర్.. అభివృద్ధి, సంక్షేమం నాణేనికి రెండు వైపుల లాంటిది.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళుతున్నాం అన్నారు.. ఐటీ నుంచి ఏఐ రెవల్యూషన్‌ దిశగా ఏపీ సాగుతోంది.. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు..

  • 24 Feb 2025 10:21 AM (IST)

    అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్‌

    అసెంబ్లీ సమావేశాలను తొలిరోజే వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు.. గవర్నర్‌ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు వైసీపీ సభ్యులు.. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాసేపు నినాదాలు చేసిన సభ్యులు.. ఆ తర్వాత వాకౌట్ చేశారు..

  • 24 Feb 2025 10:15 AM (IST)

    సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు

    కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నాం.. 200 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశాం.. పెన్షన్లు రూ.4 వేలకు పెంచాం.. మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నాం.. అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం.. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపిన గవర్నర్‌

  • 24 Feb 2025 10:11 AM (IST)

    అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది

    అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది అన్నారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్.. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారు.. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది.. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని తన ప్రసంగంలో వెల్లడించారు..