Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్.. అయితే, బాధితురాలు తరపున వాదనలు వినిపించారు పీపీ లక్ష్మీనారాయణ, న్యాయవాది నర్రా శ్రీనివాస్.. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని.. బాధితురాలు జత్వానీ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీనారాయణ వాదించారు.. కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పాత్ర ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. బాధితురాలు, తల్లి, తండ్రిని పోలీసులు టార్చర్‌కి గురిచేశారని పేర్కొన్నారు.. మరోవైపు.. నిందితుడు కుక్కల విద్యాసాగర్ తరుపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు కొనసాగించారు.. విద్యాసాగర్ 75 రోజులుగా జైలులో ఉన్నారని.. ఇప్పటికైనా బెయిల్ మంజూరు చేయాలని విద్యాసాగర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.. అయితే, ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది..
Read Also:Fastest Centuries In T20: టి20లలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్స్ వీరే